దామెర పోలీస్ స్టేషన్‌లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం

BLN తెలుగు దినపత్రిక. దామెర: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం దామెర పోలీస్ స్టేషన్‌లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు.
పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దామెర ఎస్‌ఐ ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది కలిసి పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజలు కూడా తమ ఇళ్లు, కార్యాలయాల పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛమైన వాతావరణానికి సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post