శాయంపేట ఎంపీడీఓ కార్యాలయానికి జడ్పీ సీఈఓ సందర్శన

BLN తెలుగు దినపత్రిక శాయంపేట:
హనుమకొండ జిల్లా పరిషత్ నూతన సీఈఓ శాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. రేపు.మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన కార్యాలయానికి చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా మండలంలో అమలు అవుతున్న ప్రభుత్వ పథకాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీల పనితీరుపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే కార్యాలయ నిర్వహణ, రికార్డులు మరియు ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
జడ్పీ సీఈఓ సందర్శన నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post