అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

BLN తెలుగు దినపత్రిక, శాయంపేట:
శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. మార్చి 8, ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గట్లకానిపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ వైద్య శిబిరం నిర్వహించబడనుంది.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, హనుమకొండకు చెందిన శ్రీనివాస హాస్పిటల్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది, స్థానిక డ్వాక్రా మహిళా సంఘాలు మరియు గ్రామ శ్రేయోభిలాషుల సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.
ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గుండె సంబంధిత వ్యాధులు, స్త్రీల ఆరోగ్యం, చిన్నపిల్లల వైద్యులు, చర్మవ్యాధులు, ఎముకల సంబంధిత వ్యాధుల నిపుణులు పాల్గొని రోగులను పరీక్షించనున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్, ఈసీజీ వంటి సాధారణ వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు అవసరమైన ప్రాథమిక మందులను కూడా ఉచితంగా అందించనున్నారు. అలాగే మహిళల ఆరోగ్య పరిరక్షణ, శుభ్రత, పోషకాహారం వంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ కూడా నిర్వహించనున్నారు.
గట్లకానిపర్తి గ్రామ ప్రజలతో పాటు నర్సింహులపల్లి, పోచారం, మాంధారిపేట, సూరంపేట, పులుకుర్తి తదితర పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు కోరారు. ప్రజల ఆరోగ్యం కోసం శ్రీనివాస హాస్పిటల్ వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post