సూర్యనాయక్ తండా బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా మాలోతు తిరుపతి ఏకగ్రీవ ఎన్నిక

BLN తెలుగు దినపత్రిక, శాయంపేట:
శాయంపేట మండలం సూర్యనాయక్ తండాలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా మాలోతు తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మాలోతు తిరుపతి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గెలుపు కోసం శక్తివంచన లేకుండా శ్రమిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ లత లక్ష్మారెడ్డి, సర్పంచ్ లావుడియా రమ రవి, భాస్కర్, లింగు నాయక్, ముని, కొమురయ్య, జరుపుల రాజు తదితర నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post