శ్రీ మత్స్యగిరి దేవాలయంలో సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన, ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం లో జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీ శుక్రవారం సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు దేవాలయం నుండి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం ఉదయం 10 గంటలకు తలంబ్రాలను తీసుకురావడం, 10:30 గంటలకు రామాయణంపై క్విజ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అలాగే సౌమిత్రి లక్ష్మణాచారి గారి చేత ధార్మిక ఉపన్యాసం, ఉదయం 11:30 గంటలకు విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధన్, పుణ్యావచన కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం 12:05 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుందని వివరించారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు లెక్కల లక్ష్మీ – జలంధర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి, అడ్వకేట్ లెక్కల జలంధర్ రెడ్డి, చింతల రవిపాల్, గిద్దమారి సురేష్, కానుగుల నాగరాజు, ఉప్పు రాజు, ఎం. నాగరాజు, అనుకారి శివాజీ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post