శాయంపేట మండల కేంద్రంలోని ప్రధాన కూటమి పరిసరాలు తీవ్ర చీకటిమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బస్టాండ్ కూటమి నుండి మాదారిపేటకు వెళ్లే రహదారి, అలాగే పత్తిపాకకు వెళ్లే మార్గంలో సెంట్రల్ లైటింగ్ రావటం లేదు.లేకపోవడంతో రాత్రి సమయంలో పూర్తిగా చీకటి నెలకొంది. మైలారం రోడ్డుపై కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
వీధిలైట్లు పనిచేయకపోవడం లేదా అసలు ఏర్పాటు లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు రాత్రివేళ రాకపోకలు సాగించడం కష్టసాధ్యంగా మారింది. చీకటి కారణంగా ప్రమాదాల భయం నెలకొనడంతో పాటు మహిళలు, వృద్ధులు ప్రత్యేకంగా ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన కూటమి వంటి రద్దీ ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉండటం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేసి, పనిచేయని లైట్లను మరమ్మతు చేయాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
Post a Comment