దామెర మండల పరిధిలోని ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన శాతరాశి శ్రీవాణి (25) అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం, శ్రీవాణి ఈ నెల 21వ తేదీ సాయంత్రం సుమారు 6.00 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బంధువు శాతరాశి జయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దామెర ఎస్సై కొంక అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీవాణి ఎత్తు సుమారు 5 అడుగులు ఉండి, తెలుపు వర్ణం, గుండ్రటి ముఖం కలిగి ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో పసుపు రంగు టాప్, తెలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమె ఆచూకీ తెలిసిన వారు వెంటనే దామెర పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
SI దామెర – 8712685228
PS దామెర – 8712685020
Post a Comment