నల్లబెల్లి మండలంలో సర్పంచ్‌ల కమిటీ ఏర్పాటుకు పిలుపు

నల్లబెల్లి మండలంలో గ్రామాల అభివృద్ధి, సర్పంచ్‌లకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారం దిశగా కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. మండలంలోని సర్పంచ్‌లందరికీ రంగాపురం సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు పిలుపునిచ్చారు.
మండలంలో సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడంతో పాటు, పరస్పర సహకారంతో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు సర్పంచ్‌ల కమిటీని త్వరలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కమిటీలో అధ్యక్షుడు, కార్యదర్శులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి, సమస్యలపై సమగ్ర చర్చలు జరిపి పరిష్కార మార్గాలను కనుగొనాలని సూచించారు.
అలాగే మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు ఈ కమిటీ ఏర్పాటుకు సహకరించాలని, తమ అభిప్రాయాలు మరియు సూచనలు తెలియజేయాలని కోరారు. సర్పంచ్‌ల ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ కలిసి పనిచేస్తేనే సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
ఈ కమిటీ ఏర్పాటు ద్వారా మండల స్థాయిలో సర్పంచ్‌లకు బలమైన వేదిక ఏర్పడి, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post