అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శాయంపేట మండలం గట్లకానిపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, హనుమకొండలోని శ్రీనివాస హాస్పిటల్, గ్రామపంచాయతీ పాలకవర్గం, డ్వాక్రా మహిళా సంఘాలు, గ్రామ శ్రేయోభిలాషులు మరియు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ శ్రీమతి వైనాల విజయ, ఉప సర్పంచ్ శ్రీమతి ఒంటెల లావణ్య హాజరయ్యారు. అలాగే శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ అపర్ణ, డాక్టర్ వినోద్ మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పురుషులకు సమానంగా మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కుటుంబాన్ని సక్రమంగా నిర్వహించడం నుండి దేశ అభివృద్ధి వరకు మహిళల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే మహిళల కృషి ఎంతో అవసరమని, మహిళలు తల్లి, అక్క, చెల్లి, భార్యగా అనేక పాత్రలు పోషిస్తూ కుటుంబానికి ఆనందం, ప్రేమను అందిస్తారని అన్నారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 300 మందికి పైగా ప్రజలు వైద్య సేవలను వినియోగించుకున్నారు. ప్రముఖ వైద్యులు ముప్పిడి విశ్వభరత్ రెడ్డి (జనరల్ ఫిజీషియన్), డాక్టర్ గట్ల నాగ సామ్రాట్ (జనరల్ సర్జన్), డాక్టర్ సాయి చరణ్ రెడ్డి (ఆర్థోపెడిక్), డాక్టర్ ఎస్. కావ్య (స్త్రీల వైద్య నిపుణులు), డాక్టర్ ఎస్. రాకేష్ (పిల్లల వైద్య నిపుణులు) పాల్గొని వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శ్రేయోభిలాషులు ముప్పిడి కృష్ణార్జున రెడ్డి, గడ్డం కేశవమూర్తి, మార్త బిక్షపతి, అనంతల సారంగపాణి, న్యాయవాది ఒంటేరు చంద్రమౌళి, ముప్పిడి చంద్రసేనారెడ్డి, ముప్పిడి విజయ్ సేనారెడ్డి, కేశబోయిన సత్యనారాయణ, పబ్బతి నాగభూషణం, పూజారి విజయకుమార్, వైనాల సంతోష్ బాబు, బోడకుంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బొమ్మకంటి ముత్యాలు, ఉపాధ్యక్షులు బొమ్మకంటి నాగరాజు, సముద్రాల లింగమూర్తి, నరెడ్ల రాంబాబు, బొమ్మకంటి అజయ్, తప్పెట్ల రాజకుమార్, బొమ్మకంటి లక్ష్మణ్, బొమ్మకంటి సిద్దు మరియు శ్రీనివాస హాస్పిటల్ సిబ్బంది సందీప్, తప్పెట్ల కార్తీక్, రాము తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post a Comment