మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గండ్ర జ్యోతి

BLN తెలుగు దినపత్రిక.హన్మకొండ, మార్చి 8:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలో ఎస్వీఎస్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి. వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్, భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళల ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన మరియు వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించే హెల్త్ అండ్ వెల్త్ అవగాహన సదస్సు నిర్వహించారు.
కార్యక్రమంలో గండ్ర జ్యోతి మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కుటుంబాన్ని ముందుకు నడిపే శక్తి మహిళలదేనని, నేటి కాలంలో మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ దేశ అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ఒక్కప్పుడు వంటగదికే పరిమితమైన మహిళలు నేడు అంతరిక్షం వరకు ఎదిగారని, ఇది ప్రతి మహిళకు గర్వకారణమని పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా, ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే కుటుంబం మరియు సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సరైన పోషకాహారం, వ్యాయామం మరియు ఆర్థిక ప్రణాళికపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఎస్వీఎస్ న్యూట్రిషన్ సంస్థ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గండ్ర జ్యోతి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, నిర్వాహకులు మరియు  పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post