కొమ్మాల నరసింహుడి రథోత్సవానికి రంగం సిద్ధం

కొమ్మాల నరసింహుడి రథోత్సవానికి రంగం సిద్ధం
*ఈ రోజు సాయంత్రం నిత్య విధి మొక్కుబడులు
*రాత్రి 10 గంటలకు మొదలవనున్న రథోత్సవం
BLN తెలుగు దినపత్రిక, గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నేటితో ముగియనున్నది. మండలంలోని కొమ్మాల గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొని వచ్చి పురాతన చరిత గల రథంలో ఆలయం చుట్టూ ఊరేగింపుగా రథోత్సవం నిర్వహిస్తారు. ఇందుకోసం రథాన్ని ప్రత్యేక అలంకరణలు చేసి రథోత్సవానికి సిద్ధం చేసినట్లు ఆలయ ఈఓ ప్రసాద్,వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసా చార్యులు,అర్చకులు కాండూరి రామాచార్యులు తెలిపారు.రథోత్సవ ఏర్పాట్లను మండల ఎంపీఓ పాక శ్రీనివాస్,కొమ్మాల పంచాయతీ కార్యదర్శి శంకర్ రావుతో కలిసి పర్యవేక్షించారు.


0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post