శాయంపేట మండల కేంద్రంలోని సురేఖ మండల సమాఖ్య కార్యాలయంలో ఈనెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా శనివారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సురేఖ మండల సమాఖ్య అధ్యక్షురాలు గడిపే సుమలత కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏపీఎం వేణుగోపాలరావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళా లేనిదే సృష్టి లేదని పేర్కొన్నారు.
నేటి పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగి కుటుంబాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు.
అనంతరం మండల సమాఖ్యలో పనిచేస్తున్న సీసీ జిన్నా మంజుల, అకౌంటెంట్ గోలి అనిత, అటెండర్ పాపని మంజులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సీసీలు విజయకుమార్, శ్రీనివాసరావు, సురేఖ మండల సమాఖ్య కోశాధికారి దాసరి కల్పనాదేవి, వివో అధ్యక్షురాళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment