దిశ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

BLN తెలుగు దినపత్రిక.హన్మకొండ, మార్చి 7:
హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం (ఐడీఓసీ)లో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎంపీ కడియం కావ్య అధ్యక్షత వహించారు.
సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు వివరాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలోని శాయంపేట మండల ప్రభుత్వ గురుకులాలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అలాగే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పాఠశాలల వద్ద కోతుల బెడదను నివారించేందుకు చర్యలు చేపట్టాలని, కిచెన్ షెడ్లు నిర్మించాలని, తాగునీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. మండలంలోని గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై చర్చించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.
ఈ సమావేశంలో దిశ వైస్ చైర్మన్ బండా ప్రకాష్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post