మృతురాలికి బీజేపీ నేత కీర్తిరెడ్డి నివాళి

శాయంపేట, మార్చి 7:
శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన దుంపల ఆదిరెడ్డి మృతిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మృతురాలి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాయరాకుల మొగిలి, మండల అధ్యక్షులు రామకృష్ణ, నాయకులు కానుగుల నాగరాజు, ఉప్పు రాజు, రమణారెడ్డి, సమ్మయ్య, గిద్దమరి సురేష్, రాజశేఖర్, చంద్రమౌళి, ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post