పరకాల పట్టణ పురపాలక సంఘం నూతన చైర్మన్‌గా ఎన్నికైన సునీల్ కుమార్‌ను పరకాల సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శ్రీ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ నాగబండి విద్యాసాగర్ ఆధ్వర్యంలో చైర్మన్ సునీల్ కుమార్‌కు బోకే అందించి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి చైర్మన్ సునీల్ కుమార్ కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండి పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పరకాల శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు, ఆర్య సంఘ కన్యకా పరమేశ్వరి ఆలయ సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పరకాల పురపాలక సంఘ కౌన్సిలర్లు కొయ్యడ శ్రీనివాస్, బండి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment