న్యూఢిల్లీ, మార్చి 23: టెలికాం రంగంలో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. Vodafone Idea సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ BSNLతో చేతులు కలిపే దిశగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నెట్‌వర్క్ పరిధిని విస్తరించుకోవాలనే లక్ష్యంతో ఈ రెండు సంస్థలు తమ టెలికాం టవర్లు, ఆప్టికల్ ఫైబర్, స్పెక్ట్రమ్ వంటి మౌలిక వసతులను పరస్పరం పంచుకోవడంపై చర్చలు ప్రారంభించాయి. మౌలిక సదుపాయాలను పంచుకోవడం వల్ల నెట్‌వర్క్ నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని, ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ సంస్థలకు ఉపశమనాన్ని కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ బలంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో వొడాఫోన్ ఐడియా మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ సహకారం అమలులోకి వస్తే వినియోగదారులకు మెరుగైన సిగ్నల్, డేటా సేవలు అందే అవకాశముంది.
అలాగే Reliance Jio, Bharti Airtel వంటి దిగ్గజ టెలికాం సంస్థలతో పోటీ పడటానికి ఈ భాగస్వామ్యం కీలకంగా మారనుంది. అయితే, ఈ ఒప్పందంపై తుది నిర్ణయం వాణిజ్యపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Post a Comment