హైదరాబాద్, మార్చి 23: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన “చలో అసెంబ్లీ” కార్యక్రమంలో భాగంగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డిని పోలీసులు అసెంబ్లీ ఆవరణంలో అరెస్ట్ చేశారు.
భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇలాంటి చర్యలకు భయపడమని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కుతోందని వారు తీవ్రంగా మండిపడ్డారు.
ఈ ఘటనతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మరింత ఉత్కంఠభరితంగా మారింది.
అరెస్ట్ అయిన వారిలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు, శాయంపేట మండల అధ్యక్షుడు రామకృష్ణ, మైలారం సర్పంచ్ తిరుపతి, గోరుకొత్తపల్లి ప్రధాన కార్యదర్శి సుమన్, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితర రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు మరియు కార్యకర్తలు ఉన్నారు.
Post a Comment