నెలాఖరులోగా మెట్రో స్వాధీనం: సీఎం రేవంత్ రెడ్డిరూ.15 వేల కోట్లతో విస్తరణ – కొత్త సిటీ నిర్మాణానికి ప్రణాళిక

హైదరాబాద్, మార్చి 23: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోనున్నట్లు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తెలిపారు. శాసన మండలిలో మాట్లాడుతూ, రూ.15 వేల కోట్ల వ్యయంతో మెట్రోను స్వాధీనం చేసుకుని, దానిని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మెట్రో రైలు సేవలను 75 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. Larsen & Toubro (ఎల్ & టీ) ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. గత పదేళ్ల నిర్లక్ష్యం కారణంగా మెట్రో ప్రాజెక్టు దేశంలో 12వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు.
ఇక రాష్ట్ర అభివృద్ధి విషయంలో భాగంగా 33 వేల ఎకరాల్లో కొత్త సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధిని కేవలం నగరానికే పరిమితం చేయకుండా సమగ్రంగా ముందుకు తీసుకెళ్తామని, తమ ప్రభుత్వం స్మార్ట్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.
పట్టణ అభివృద్ధిలో భాగంగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని, చిన్న వ్యాపారుల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అదనంగా, జూన్–జులై నాటికి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post