శాయంపేట మండలంలో రైతులకు ‘రైతు భరోసా’ నిధుల జమ11,284 మంది రైతుల ఖాతాల్లో రూ.5.41 కోట్లు జమ

శాయంపేట, మార్చి 23: శాయంపేట మండలంలో రైతులకు శుభవార్తగా ‘రైతు భరోసా’ పథకం కింద నిధులు విడుదలయ్యాయి. ఈరోజు మండలంలోని మొత్తం 11,284 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5.41 కోట్లు జమ చేయడం జరిగినట్లు వ్యవసాయ అధికారి డి. శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారికి సమయానికి అవసరమైన సహాయం అందుతుందని పేర్కొన్నారు.
ఈ నిధులు వ్యవసాయ పనులకు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంటల ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post