జననేత నాగూర్ల వెంకన్నకు ఘనంగా జన్మదిన వేడుకలు

BLN తెలుగు దినపత్రిక.పరకాల, మార్చి 11: తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్, జననేత నాగూర్ల వెంకన్న జన్మదినాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
పరకాల మండల ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.
అనంతరం పరకాల ఫర్టిలైజర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాడికారి శివాజీ రావు ఆధ్వర్యంలో నవత బ్రదర్స్ షాప్ ఆవరణలో నాగూర్ల యువసేన మరియు ఆరే సంఘం సభ్యులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తరువాత పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు, జ్యూస్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు, మాజీ కుంకుమేశ్వర దేవస్థానం చైర్మన్ మాట్లాడుతూ పరకాల ముద్దుబిడ్డ, ప్రజానాయకుడు నాగూర్ల వెంకన్న ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే నాయకుడని కొనియాడారు. ఆయురారోగ్యాలతో మరెన్నో ఉన్నత స్థాయి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఫర్టిలైజర్ యజమానులు, వ్యాపారులు, నాగూర్ల అభిమానులు మరియు పలువురు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post