BLN తెలుగు దినపత్రికహైదరాబాద్, మార్చి 11: తెలంగాణకు కొత్త గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా బుధవారం తొలిసారి రాష్ట్రానికి చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా మరియు ఆయన సతీమణికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు కూడా గవర్నర్‌కు స్వాగతం తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను లోక్ భవన్‌లో అధికారులు చేస్తున్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణకు బదిలీ చేసింది. తెలంగాణ గవర్నర్‌గా పని చేసిన జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు.
హైదరాబాద్.చేరుకున్న కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా
byBLN TELUGU NEWS
-
0
Post a Comment