నాగుల్ల వెంకన్న జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

BLN తెలుగు దినపత్రిక .శాయంపేట, మార్చి 10: శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుల్ల వెంకన్న జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు అందజేసి వారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. నాగుల్ల వెంకన్న మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక సేవకుడు అమ్మ అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post