బాలల భద్రత, యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం

BLN తెలుగు దినపత్రిక.నల్లబెల్లి, మార్చి 10: నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామంలో బాలల భద్రత మరియు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ పి. బిక్షపతి రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు మరియు గ్రామ ప్రజలకు బాలల భద్రత ప్రాముఖ్యతతో పాటు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం రంగాపురం గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ పి. బిక్షపతి రావు మాట్లాడుతూ చిన్నపిల్లల భద్రతపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్ల నుండి యువత దూరంగా ఉండాలని, మంచి మార్గంలో నడిచి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎస్సై గోవర్ధన్, డాక్టర్ పి. ఆచార్య, రెవెన్యూ ఆర్‌ఐ, పంచాయతీ కార్యదర్శి జీపీఓ శ్యామ్, ఉప సర్పంచ్ రామ్మూర్తి, గ్రామ వార్డ్ మెంబర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కార్యక్రమం చివరలో గ్రామ పెద్దలు, ప్రజలు మరియు అధికారులు ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post