పశువులకు గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం

BLN తెలుగు దినపత్రిక, మార్చి 10: శాయంపేట మండల పశువైద్యశాల ఆధ్వర్యంలో మంగళవారం పశువులకు గాలికుంటు (FMD) నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల పశువైద్యశాలలో నిర్వహించి పశువులకు టీకాలు వేయించారు.
ఈ సందర్భంగా జె.ఇ. సునిల్ మాట్లాడుతూ పశువులకు టీకాలు వేయించడం వల్ల వాటిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. టీకాల వల్ల పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాల ఉత్పత్తి పెరుగుతుందని, ప్రత్యుత్పత్తి శక్తి కూడా మెరుగవుతుందని చెప్పారు. దీని ద్వారా రైతులకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని వివరించారు.
రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌వీఎల్ఓ–ఎస్‌ఈ, జెవి0–62, వీఏ సదానందం మరియు రైతు సోదరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post