BLN తెలుగు దినపత్రిక.దామెర, మార్చి 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా EAGLE FORCE TELANGANA ఆధ్వర్యంలో పిల్లల భద్రత మరియు డ్రగ్స్‌కు అడ్డుకట్ట కార్యక్రమాన్ని మంగళవారం దామెర మండల పరిధిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కొగిల్వాయి గవర్నమెంట్ హై స్కూల్, ఊరుగొండ గవర్నమెంట్ హై స్కూల్, ముస్త్యాలపల్లి గవర్నమెంట్ హై స్కూల్ మరియు దామెర డిస్నీల్యాండ్ హై స్కూల్‌లలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
అదేవిధంగా ఊరుగొండ గ్రామంలో సుమారు 350 మంది విద్యార్థులతో మెయిన్ రోడ్డు నుంచి గవర్నమెంట్ హై స్కూల్ వరకు యాంటీ డ్రగ్స్ ఫ్లెక్సీలు, ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు సందేశం అందించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి, దామెర ఎస్సై కొంక అశోక్, దామెర మండల MPO రంగాచారి, డిప్యూటీ తహసీల్దార్ సంపత్ రావు, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామపంచాయతీ అధికారులు మరియు పాఠశాలల హెడ్‌మాస్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దామెర ఎస్సై కొంక అశోక్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా కుటుంబం మరియు సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. విద్యార్థులు మరియు యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ విక్రయించడం లేదా వినియోగించడం గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
Post a Comment