ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు“యుద్ధం కాదు.. దౌత్యమే పరిష్కారం”

BLN తెలుగు దినపత్రిక.న్యూఢిల్లీ, మార్చి :
ఇరాన్ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ  కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్యకైనా సైనిక యుద్ధం శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని, సమస్యలకు పరిష్కారం యుద్ధరంగంలో కాదని, సంభాషణలు మరియు దౌత్య మార్గాల్లోనే ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ద్వారా ఒక ప్రకటన విడుదలైంది.
దౌత్య మార్గానికే ప్రాధాన్యం
ప్రపంచ దేశాలు సంభాషణ, దౌత్య మార్గాన్ని అనుసరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించేందుకు శాంతియుత పరిష్కారం అవసరమని వ్యాఖ్యానించారు. భారత్ ఎప్పటినుంచో శాంతి, సంభాషణ, దౌత్యానికి మద్దతు ఇస్తోందని తెలిపారు.
యుద్ధాల వల్ల మానవ నష్టం, ఆర్థిక నష్టం తీవ్రంగా పెరుగుతుందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాలు సహకార భావంతో ముందుకు రావాలని సూచించారు.
భారత్ అంతర్జాతీయ వేదికలపై శాంతి, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post