మహబూబాబాద్ జిల్లాలో మక్కల సాగు అధికంగా జరిగిన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా మక్కలను కొనుగోలు చేయించాలని ఆత్మ కమిటీ చైర్మన్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నల్లు సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు.
జిల్లా కలెక్టర్ Sneha Shabarish ను నల్లు సుధాకర్ రెడ్డి, పోలేపాక వెంకన్న, నాగరాజులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లాలో మక్కల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, అయితే వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని వివరించారు.
రైతాంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని Telangana State MARKFED ద్వారా మద్దతు ధరకు మక్కలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
రైతుల ప్రయోజనాల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.
Post a Comment