హనుమకొండ: హనుమకొండ కృష్ణ కాలనీకి చెందిన సీనియర్ జర్నలిస్టు పూజారి విజయ్ కుమార్ అనుమానాస్పదంగా అదృశ్యమయ్యారు. వరంగల్ నగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులతో కలిసిమెలిసి ఉండే ఆయన మంగళవారం నుంచి కనిపించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
మంగళవారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. ఆయనకు చెందిన TS 03 EU 2731 నంబర్ గల బ్లూ కలర్ గ్లామర్ ద్విచక్ర వాహనం కూడా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనపై బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విజయ్ కుమార్ ఆచూకీ లభించినట్లయితే వెంటనే సమాచారం అందించాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన తమ్ముడు పూజారి శ్రీనివాస్ (సెల్: 9652988566) కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
తన భర్త అదృశ్యం మిస్టరీని త్వరితగతిన ఛేదించాలని పోలీస్ అధికారులను విజయ్ కుమార్ సతీమణి పూజారి సుజాత వేడుకున్నారు.
Post a Comment