వరంగల్: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 1955–2026 ప్లాటినం జూబ్లీ వేడుకలను ఈ నెల 29వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం వెల్లడించింది. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వేడుకల వివరాలను తెలియజేశారు.
కళాశాల స్థాపనకు 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం అధ్యక్షుడు ఇవి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమం పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకునే వేదికగా ఉండడంతో పాటు, ప్రస్తుత విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.
వేడుకల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సన్మానాలు, స్మారక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్వ విద్యార్థులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Good information.. congratulations 🙏🏼
ReplyDeletePost a Comment