లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయం అమలైతే ప్రస్తుతం 543 ఉన్న పార్లమెంట్ స్థానాలు 816కి పెరుగుతాయి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 4,123 అసెంబ్లీ స్థానాలు 6,185కి చేరనున్నాయి.
రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి పెరుగుతాయి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు 179కి పెరగనున్నాయి.
లోక్‌సభ స్థానాల పరంగా కూడా పెరుగుదల ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 38కి, తెలంగాణలో 26కి చేరే అవకాశముందని సమాచారం.
Post a Comment