జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు . జీవన్ రెడ్డి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. సుమారు 42 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు సేవలందించిన ఆయన, జగిత్యాలలో అనుచరులతో సమావేశమై తన నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు పదవి ముఖ్యం కాదని, ఆత్మగౌరవం కోసమే పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి, పార్టీలో గత రెండేళ్లుగా తాను అగౌరవానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎదిగారని, అయితే అదే కార్యకర్తలకు నేడు రక్షణ లేకపోవడం బాధాకరమని అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లోనే పార్టీ అధిష్టానానికి లేఖ రాసినా ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు. తన రాజీనామా లేఖను Mallikarjun Kharge కు పంపుతున్నట్లు వెల్లడించారు.
తనకు సన్నిహితుడైన కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డి హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. “ఒక కార్యకర్త దారుణంగా హత్యకు గురైనా ముఖ్యమంత్రి నుంచి కనీస పరామర్శ లేకపోవడం విచారకరం” అని విమర్శించారు. ఎమ్మెల్సీగా ఉన్న తాను న్యాయం కోసం రోడ్డెక్కాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శిస్తూ, ఇకపై తన పోరాటం. రేవంత్ రెడ్డి పైనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఇదిలా ఉండగా, మాజీ మంత్రి . హరీష్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ అడుగు ఏ దిశగా ఉంటుందన్నది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Post a Comment