రైతుల పక్షపాతిగా రేవంత్ ప్రభుత్వం పని చేస్తోంది: ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి: రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్షపాతిగా పనిచేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పలు రైతు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
“రైతు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రైతు” అన్న నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
గత ప్రభుత్వ కాలంలో వర్షాల కారణంగా చెరువులు, కుంటలు దెబ్బతిన్నప్పటికీ వాటి మరమ్మత్తులు చేయకుండా భూపాలపల్లి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రైతులకు సబ్సిడీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలను అందించిందని అన్నారు.
మహిళా సంఘాల సాధికారతకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణతో పాటు సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post