శాయంపేట పీహెచ్‌సీలో మెగా వైద్య శిబిరం

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో.మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు శాయంపేట మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.
ఈ శిబిరంలో స్త్రీల సమస్యలకు సంబంధించిన వైద్యురాలు (OBG), పిల్లల వైద్యుడు (Paediatrician), ఎముకల వైద్యుడు (Orthopedic), కంటి వైద్యుడు (Ophthalmologist), జనరల్ ఫిజిషియన్, దంత వైద్యుడు (Dentist) అందుబాటులో ఉండి రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు, చికిత్సలు అందించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆశా కార్యకర్తలు మరియు ఏఎన్‌ఎంలు తమ పరిధిలో ఉన్న ప్రజలకు సమాచారం ఇచ్చి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని ఉదయం 9:30 గంటలలోపు పీహెచ్‌సీకి పంపించాలని వైద్యాధికారి కోరారు. అలాగే గర్భిణులు (ANC) మరియు బాలింతలు (PNC) కూడా తప్పకుండా ఈ వైద్య శిబిరానికి హాజరుకావాలని సూచించారు.
ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే హాజరుకానున్నారు. శాయంపేట మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని మెడికల్ ఆఫీసర్ తెలిపారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post