సీనియర్ మేటు తొలగింపు – గ్రామసభ తీర్మానం

BLN తెలుగు దినపత్రిక:
శాయంపేటమండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పర్యవేక్షిస్తున్న సీనియర్ మేటు ముక్కెర రంజిత్ కుమార్‌ను గ్రామపంచాయతీ తీర్మానం ద్వారా తొలగించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వాంకుడోత్ సదర్ లాల్ మాట్లాడుతూ, రంజిత్ కుమార్ ఉపాధి హామీ పథకంలో నిర్వహించిన పనుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. గ్రామ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు గురువారం గ్రామసభను నిర్వహించామని తెలిపారు.
గ్రామసభలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేసి సీనియర్ మేటును బాధ్యతల నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో ఉపసర్పంచ్ సంఘాల బిక్షపతి, వార్డు సభ్యులు మిరియాల సమ్మక్క, అజ్మీర జోయ్, తరాల చంద్రమౌళి, గోపరాజు లక్ష్మి, ఒంటేరు వెంకట్రాజు, బొమ్మకంటి శాంతి కుమార్, తరాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో ఉపాధి హామీ పనులు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం కొనసాగుతాయని సర్పంచ్ స్పష్టం చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post