హనుమకొండలో ఉచిత కంటి పరీక్షల శిబిరం విజయవంతం

హనుమకొండ, మార్చి 30: హనుమకొండ సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు ఏసీపీ శ్రీ పి. నరసింహారావు ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈస్ట్ జోన్ డీసీపీ శ్రీమతి ధార కవిత ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీలోని స్వాగత్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 200 మంది వివిధ వాహనాల డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ ధార కవిత మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా డ్రైవర్లు తమ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ, సకాలంలో పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రహదారి భద్రతలో డ్రైవర్ల కంటి చూపు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుబేదారి, హనుమకొండ, కేయూ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు మరియు సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post