పెద్దవంగర, మార్చి 29: రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు “Arrive Alive” కార్యక్రమం భాగంగా పెద్దవంగర పోలీస్ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని డ్రైవర్లు మరియు స్థానిక ప్రజలకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు డ్రైవర్లు పాల్గొని తమ కంటి చూపును పరీక్షించించుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు మీద వాహనాలు నడిపే ప్రతి ఒక్క డ్రైవర్‌కు కంటి చూపు చాలా ముఖ్యమని తెలిపారు. కంటి చూపులో ఏవైనా లోపాలు ఉంటే రోడ్డు ప్రమాదాలకు దారితీసే అవకాశముందని హెచ్చరించారు. అందువల్ల ప్రతి డ్రైవర్ ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా, రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచిస్తూ, అతివేగంగా వాహనాలు నడపకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, త్రిబుల్ రైడింగ్ నివారించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని చెప్పారు. టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్‌ఐ స్పష్టం చేశారు.
Post a Comment