BLN తెలుగు దినపత్రిక
తేదీ: 28-03-2026
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళల భద్రత కోసం పోలీసులు వినూత్నంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. టేకుమట్ల మండలానికి చెందిన మహిళా ఎస్సై అమూల్య, పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకురావడానికి విద్యార్థినిగా మారి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
పరీక్షా కేంద్రాల వద్ద ఈవ్‌టీజింగ్ ఘటనలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న ఆమె, ఖాకీ యూనిఫాం వదిలి సాధారణ విద్యార్థినిలా ఎరుపు రంగు దుస్తులు ధరించి, చేతిలో పుస్తకాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఎవరూ అనుమానించకుండా విద్యార్థినిలా మెలిగిన ఆమె, అక్కడ వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిలను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.
ఈ చర్యతో పోలీసులు ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా ప్రజల భద్రత కోసం అప్రమత్తంగా ఉంటారని ఎస్సై అమూల్య నిరూపించారు. ఆమె ధైర్యం, సమయస్ఫూర్తిని స్థానికులు ప్రశంసిస్తూ, ఇది ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మహిళల భద్రత కోసం పోలీసులు ఇలాంటి వినూత్న చర్యలు చేపట్టడం అభినందనీయమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Post a Comment