అన్నం పరబ్రహ్మ స్వరూపం… ఆంజనేయస్వామి ఆలయంలో అన్నదాన సేవ ఘనంగా

శాయంపేట మండలం, సూర్య నాయక్ తండ: “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అనే సద్భావంతో సూర్య నాయక్ తండ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని భక్తి భావంతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు మరియు దాతల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మహా పుణ్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ లావుడియా రామా రవి, ఉప సర్పంచ్ సునీత భాస్కర్ హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాలోత్ భాషా, అజ్మీర్ లక్ష్మణ్, మాలోతు తిరుపతి, వినోద్, రాజు, వసురం, సునీల్, మొగిలి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post