వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ గుండు సుధారాణి నగర బడ్జెట్‌పై కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది చివరి బడ్జెట్ సమావేశంలో సుమారు రూ.1,040 కోట్లు 58 లక్షల 75 వేల అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
సామాన్య ప్రజలపై ఎలాంటి అదనపు పన్నుల భారం లేకుండా బడ్జెట్‌ను రూపొందించినట్లు మేయర్ స్పష్టం చేశారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో బడ్జెట్‌కు తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు.
ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సాధారణ పన్నుల రూపంలో రూ.349 కోట్లు 19 లక్షల ఆదాయం వస్తోందని, వివిధ గ్రాంట్ల ద్వారా రూ.685 కోట్లు 28 లక్షల ఆదాయం లభిస్తోందని వివరించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన రూ.25 కోట్లు, అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన రూ.18 కోట్లను కలుపుకుని మొత్తం రూ.1080 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రేటర్ వరంగల్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మేయర్ అన్నారు. హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద మహానగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు
Post a Comment