యువత కోసం “AI - Careers & Future Tech” వర్క్‌షాప్ వాల్ స్టిక్కర్ ఆవిష్కరణ

యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించేందుకు గంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “AI - Careers & Future Tech” వర్క్‌షాప్‌కు సంబంధించిన వాల్ స్టిక్కర్‌ను శివనగర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఈ రోజు శివనగర్‌లోని శ్రీ రామాలయ కళ్యాణ మండపంలో నిర్వహించారు.
వచ్చే ఏప్రిల్ 5, 2026 (ఆదివారం) రోజున బీటెక్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత కోసం ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్ టెక్నాలజీలపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, సభ్యులు కందుకూరి విజయ్ కుమార్, సతీష్ పోశాల, సురేష్ పౌడాల, శ్రవణ్ పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక శివనగర్ మండల బీజేపీ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, ఇనుముల అజయ్ కుమార్, వైట్ల గణేష్, శెట్టి రమేష్, గుండేటి సూరజ్, మహమ్మద్ యూసుఫ్, తోట సాగరిక, ఓని కల్పన, కొత్తపేట కల్పన తదితరులు హాజరయ్యారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post