శాయంపేట మండలం పెద్ద కొడపాక గ్రామంలోని శ్రీ వేద పాఠశాల మరోసారి విద్యా రంగంలో తన ప్రతిభను చాటుకుంది. 5వ తరగతి తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షలో పాఠశాల నుంచి హాజరైన 10 మంది విద్యార్థులందరూ మొదటి విడతలోనే గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించి 100 శాతం ఫలితాలను నమోదు చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ విజయ్ ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ విజయం గురువుల అంకితభావం, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం ఫలితమని పేర్కొన్నారు. విజయాన్ని సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ ఘన విజయం ద్వారా శ్రీ వేద పాఠశాల ప్రాంతంలో విద్యా రంగంలో ప్రత్యేక గుర్తింపును మరింత బలపరుచుకుంది.
Post a Comment