అక్రమ అరెస్టులు ఆపాలి – బిఆర్ఎస్వి నేతల డిమాండ్

శాయంపేట, మార్చి 24:రాష్ట్రంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని, ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని బిఆర్ఎస్వి నాయకులు ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు కొమ్ముల శివను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా కొమ్ముల శివ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో తనను 15 సార్లు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒకవైపు అరెస్టులు, మరోవైపు ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం భయంతో ఇలాంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఇప్పటివరకు అమలు చేయలేదని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు.
అదేవిధంగా కేటీఆర్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును ఆమోదించి ప్రజా పాలన కొనసాగించాలని సూచించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఏ వర్గానికీ న్యాయం చేయడం లేదని విమర్శించారు.
రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post