కొండాయిల్‌పల్లి గ్రామంలో పర్యావరణ అవగాహన కార్యక్రమం

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాయిల్‌పల్లి గ్రామంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ క్షేత్ర పర్యటన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం సోమవారం జరిగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు తడి మరియు పొడి చెత్త వేరు చేసే విధానం, ఘన వ్యర్థాల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. గ్రామంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని విద్యార్థులు సందర్శించి, కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. టీఎన్జీసీ కోఆర్డినేటర్ సూర్య కిరణ్, ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎకో క్లబ్ కోఆర్డినేటర్‌లు ఈ ప్రక్రియను వివరించారు.
మండల పంచాయతీ అధికారి పసర గొండ రవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. రోజువారీ జీవితంలో తడి, పొడి చెత్తను వేరు చేయడం అలవాటు చేసుకోవడం ద్వారా పరిశుభ్రతతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
గ్రామ సర్పంచ్ ఎరుకల స్వప్న, ఉప సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ, తడి చెత్తను ఎరువుగా మార్చడం, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం వంటి విధానాలను ప్రజలు అనుసరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాలగిరి రజిత, డిగ్రీ కాలేజీ అధ్యాపకులు, వార్డు సభ్యులు, విద్యార్థులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం పెంపొందించడంతో పాటు, గ్రామ స్థాయిలో స్వచ్ఛతకు తోడ్పడే చర్యలకు ప్రేరణ కలిగింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post