హైదరాబాద్, మార్చి 23: రాష్ట్ర శాసనసభలో ఈరోజు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ, ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగునీటి సరఫరా, వేతన సవరణ కమిషన్ పరిస్థితి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
అదనంగా గిగ్ వర్కర్ల సంక్షేమ చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఆమ్రాబాద్ పులుల అభయారణ్యంలో కోల్గం సఫారీ, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహకాలు, రాష్ట్రంలో యూరియా కొరత, భూ రికార్డుల డిజిటలైజేషన్ వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు.
ఇక శాసనమండలిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మెడికల్ షాపుల ఏర్పాటు, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, గ్రామ పాలన అధికారులు, కొత్త పరిశ్రమల స్థాపన, ఐటీ ఉద్యోగాల కల్పన వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అలాగే సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పదోన్నతులు, గ్రామీణ ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం, హైదరాబాద్ నగరంలో ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతపై కూడా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు.
ప్రశ్నోత్తరాల అనంతరం Jupally Krishna Rao తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు, శాసనసభలో ప్రభుత్వం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. 2026 తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లును Damodar Rajanarsimha ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరనున్నారు. అలాగే 2026 తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌లో నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది వేతన హేతుబద్ధీకరణ మూడో సవరణ బిల్లును Bhatti Vikramarka ప్రవేశపెట్టనున్నారు.
అనంతరం ఉభయ సభల్లో 2026-27 వార్షిక బడ్జెట్‌పై సాధారణ చర్చను సభ్యులు కొనసాగించనున్నారు.
Post a Comment