BLN తెలుగు దినపత్రిక.భూపాలపల్లి, మార్చి 11: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నకిలీ వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేసి పెద్ద మొత్తంలో మందులను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఆకస్మికంగా క్లినిక్‌పై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు ₹45,000గా అధికారులు తెలిపారు.
Post a Comment