హనుమకొండ జిల్లా శాయంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పథకం అమలుపై జరిగిన సామాజిక తనిఖీ నివేదికలను అధికారులు ప్రజల ముందుంచారు.
ఈ సందర్భంగా తనిఖీల్లో గుర్తించిన లోపాల నేపథ్యంలో సంబంధిత అధికారులకు రికవరీ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర సహాయకులకు రూ. 5304, సాంకేతిక సహాయకులకు రూ. 1788, పంచాయతీ కార్యదర్శులకు రూ. 674 చొప్పున మొత్తం రూ. 7766 రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, డివిసీ నర్సింహా రెడ్డి, ఎస్‌క్యూసీ పుష్పలత, ప్లాంటేషన్ మేనేజర్ పి. శ్రీనివాస్ రెడ్డి, డీటీసీ శ్రీధర్, అమెండ్‌మెంట్ నాగరాజు, పీఆర్ ఏఈ శ్రీలత, ఏపీవో అనిత, ఈసీ ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment