శాయంపేట, ఫిబ్రవరి 17: గ్రామంలోని ZPSSలో 2001-02 పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ స్నేహితుడు మెరగుత్తి కిరణ్ కుటుంబానికి ఆర్థిక అండగా 25 వేల రూపాయలు అందజేశారు.09-02-2026న అనారోగ్యంతో కిరణ్ మృతిచెందినట్లు తెలుసుకున్న తోటి మిత్రులు తమ వంతు సహాయంతో ఆయన భార్య, పిల్లలకు 17-02-2026న ఈ మొత్తాన్ని అందించారు. అకాల మరణంపై తీవ్ర మనస్తాపం చెందిన మిత్రులు, కలిసి గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ బాధ వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ధైనంపల్లి సుమన్ (12వార్డు), మారపల్లి చిరంజీవి, గొట్టిముక్కల రాజకుమార్ రాజు, ఆకునూరి సూర్యప్రకాష్, సురేష్, బూర నాగరాజు, కుమారస్వామి, మారపల్లి సారంగపాణి, కోటి తదితరులు పాల్గొన్నారు.
ZPSS శాయంపేట 2001-02 పూర్వ విద్యార్థులు స్నేహిత కుటుంబానికి 25 వేల రూపాయల సహాయం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment