తొర్రూరు మున్సిపల్‌లో కాంగ్రెస్ విజయం.. ఎంపీ కడియం కావ్య ఓటు కీలకం

తొర్రూరు, ఫిబ్రవరి 18 తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య వేసిన ఒక్క ఓటు ఫలితాన్ని మార్చి, కాంగ్రెస్ పార్టీకి విజయం తెచ్చిపెట్టింది. బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 7 సీట్లు గెలిచినా, ఎక్స్-ఆఫీషియో మెంబర్‌గా కావ్య ఓటుతో కాంగ్రెస్ బలం 9కి చేరి మున్సిపల్ పీఠం దక్కించుకుంది.ఎంపీ డా.కడియం కావ్య వ్యూహాత్మక సమన్వయం, కృషి ఫలితమే ఈ గెలుపు కాంగ్రెస్ శ్రేణులు కొనియాడుతున్నాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహా నేతలు ఆనందోత్సవాలు జరిపారు.కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులు
అనంతరం మున్సిపల్ చైర్మన్‌గా శ్రావణ్‌కుమార్, వైస్ చైర్‌పర్సన్‌గా సోమరజిని రాజశేఖర్ ఎన్నికయినారు. ఎంపీ కావ్య ప్రత్యేకంగా వారిని అభినందించి, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ ఓటు రాజకీయ టర్నింగ్ పాయింట్‌గా మారి, తొర్రూరులో కాంగ్రెస్ జెండా ఎగరేసింది. కావ్య  పట్టుదలకు పార్టీ వర్గాలు కృతజ్ఞతలు తెలిపాయి

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post