శాయంపేట: కేంద్ర బడ్జెట్‌లో రైతులకు ప్రభుత్వం మొండి చూపించిందని గ్రామ స్వరాజ్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల రామచంద్రరావు ఆరోపించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో ఎమ్మెస్పీ (కనీస మద్దతు ధర) విషయంలో రైతులకు చట్టబద్ధత కల్పించడంలో విఫలమైందని తీవ్ర విమర్శించారు. పంట బీమా మొత్తాన్ని తగ్గించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పసుపు బోర్డు ఏర్పాటుకు నిధుల కేటాయింపు లేకపోవడం వల్ల రైతులు నిరాశలో మునిగారని పేర్కొన్నారు.ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా ఎరువు అందించడంలో కూడా విఫలమైందని ఆయన ఆక్షేపించారు. "రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. రైతుల పక్షాన నిరంతరం పోరాడతాం" అని హెచ్చరించారు. వెంటనే రైతుల డిమాండ్లను నెరవేర్చే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో రైతులకు మొండి చూపు: గ్రామ స్వరాజ్య రైతు సంఘం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment