శాయంపేట తహసిల్దార్ కార్యాలయాన్ని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూభారతి, సాదాబైనామా, జాతీయ రహదారులు, మీ సేవా సర్టిఫికెట్స్, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, తదితర రికార్డులను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. అదేవిధంగా మండలానికి సంబంధించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందని తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ ను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సర్టిఫికెట్స్ త్వరితగతిన జారీ చేయాలని తహసిల్దార్ ను ఆదేశించారు. సర్టిఫికెట్స్ జారీ విషయంలో జాప్యం చేయకూడదని తెలియజేశారు. భూభారతి, సాదా బైనామా, రెవెన్యూ అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి సలహాలు, సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, ఎంపీడీవో ఫణి చంద్ర, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment